![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 08, 2025, 07:35 PM
ట్రంప్ టారిఫ్ విధానాల ప్రభావం తెలంగాణలోని ఫార్మా, ఐటీ రంగాల ఎగుమతులపై ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో తెలంగాణ వృద్ధి రేటు గణనీయంగా పడిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో మద్యం ద్వారా వచ్చే ఆదాయం మినహా మిగిలిన ఆదాయం అంతా తగ్గిపోయిందని పేర్కొన్నారు. జూన్, జులై నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో ఆంధ్రప్రదేశ్ తరపున వాదించిన ఆదిత్యనాథ్‌దాస్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారుగా నియమించుకోవడంపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆదిత్యనాథ్‌దాస్ నియామకం ఏపీ ప్రయోజనాల కోసమా అని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రతికూల విధానాలు, ప్రతికూల రాజకీయాలు కనిపిస్తున్నాయని విమర్శించారు. మాజీ సర్పంచ్ నుంచి మాజీ ముఖ్యమంత్రి వరకు అందరిపై కేసులు ఎలా పెట్టాలనే ఆలోచన తప్ప అభివృద్ధిపై దృష్టి సారించడం లేదని ఆరోపించారు.