![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 08, 2025, 09:07 PM
కొత్తకోటలో మంగళవారం వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆకస్మికంగా పర్యటించారు. దండుగడ్డ కాలనీలోని అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమంలో పాల్గొని పిల్లలు పుట్టిన తర్వాత తొలి 2 ఏళ్లు కీలకమని, పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. అనంతరం పట్టణంలోని 2 వ రేషన్ దుకాణాన్ని సందర్శించి స్టాక్ రిజిస్టర్ పరిశీలించారు. రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం మాత్రమే పంపిణీ చేయాలని ఆదేశించారు.