![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 08, 2025, 08:41 PM
జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట 2వ వార్డులో గత కొన్ని రోజులుగా నీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు మంగళవారం మంచినీటి బోరుకు మరమ్మతులు చేసి కొత్త బోరు మోటారును మున్సిపల్ చైర్‌పర్స్‌న్ కోనేటి పుష్పలత, కమిషనర్ లక్ష్మారెడ్డి ప్రారంభించారు. దీంతో కాలనీవాసులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, మున్సిపల్ సిబ్బంది, కాలనీవాసులు పాల్గొన్నారు.