![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 09, 2025, 02:23 PM
తెలంగాణ ప్రభుత్వం పై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మరోసారి కీలక ఆరోపణలు చేశారు. చంద్రబాబు వయా మోదీతో మంచిగా ఉండాలని రాష్ట్ర మంత్రులు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబేమో తెలంగాణ వనరులు ఎట్లా దోచుకుపోవాలని బిజీగా ఉన్నారని ఆరోపించారు. తెలంగాణ నిధులు ఢిల్లీకి తరలిస్తుంటే, నీళ్ళను మాత్రం ఆంధ్రకు అప్పజెప్పుతున్నారని BRS ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు.చంద్రబాబు నాయుడు నాగార్జున సాగర్ ను ఆక్రమించుకున్నా కూడా రేవంత్ రెడ్డి చూస్తూ కూర్చున్నాడు, చంద్రబాబు ద్వారా మోడీ మెప్పు పొందడానికి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడు