|
|
by Suryaa Desk | Thu, May 01, 2025, 03:33 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.3.45 కోట్ల విలువైన 3.5 కిలోల బంగారాన్ని ఇవాళ డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 30 బంగారు కడ్డీలను మస్కట్ ద్వారా దుబాయ్ నుంచి వచ్చిన ఓ భారతీయ ప్రయాణీకుడు అక్రమ రవాణాకు ప్రయత్నించాడు. అతడితో పాటు, సహకరించిన ఇద్దరు విమానాశ్రయ గ్రౌండ్ హ్యాండ్లింగ్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.బంగారం ధరలు లక్ష రూపాయాలకు చేరువైన నేపథ్యంలో తక్కువ ధరకు లంభించే దుబాయ్ నుంచి బంగారం స్మగ్లింగ్ చేసి.. ఇక్కడ సొమ్ము చేసుకుంటున్నట్టు తెలిసింది. బంగారం తరలించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.