|
|
by Suryaa Desk | Fri, May 02, 2025, 10:59 AM
చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి . సరదాగా చెరువులో దిగి ప్రమాదవశాత్తు అన్న, చెల్లి, ఇంకో బాలుడు మృతి. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి గ్రామానికి చెందిన ధర్మారెడ్డి, సవిత దంపతుల కొడుకు గణేష్ రెడ్డి (13), కూతురు రక్షిత (10) హైదరాబాద్ బండ్లగూడలోని సరస్వతి శిశుమందిర్లో 7, 5వ తరగతుల్లో చదువుతున్నారు. అదే గ్రామానికి చెందిన సుధాకర్, రాధ దంపతుల కుమారుడు శ్రవణ్ కుమార్ (7) స్థానిక ప్రాథమిక పాఠశాలలో 2వ తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం వీరికి వేసవి సెలవులు కావడంతో గురువారం సాయంత్రం ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటమునిగి మృతిచెందారు . చెరువు కట్టపై బట్టలను గమనించిన స్థానికులు పక్కనే గేదెలు మేపుతున్న శ్రవణ్ కుమార్ అన్న రాజేష్ కు సమాచారం ఇచ్చారు . చుట్టుపక్కన ఉన్న రైతులు చిన్నారుల మృతదేహాలను వెలికితీసి, పోస్టుమార్టం కోసం నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు . విగతజీవులుగా పడి ఉన్న చిన్నారుల మృతదేహాలను చూసి కన్నీటిపర్యంతమయ్యారు గ్రామస్తులు