|
|
by Suryaa Desk | Tue, May 06, 2025, 10:45 AM
బోనాలు ఆధ్యాత్మిక సంబరాలని, పేద, ధనిక తేడా లేకుండా ఐక్యమత్యంతో పల్లెల్లో ఉత్సవాలు నిర్వహించుకోవడం సంతోషకరమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.ఆదివారం తెల్లాపూర్ మున్సిపాలిటీ ఈదులనాగులపల్లి కట్టమైసమ్మ బోనాల ఉత్సవాలకు హాజరై అమ్మ వార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సంధర్బంగా నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించారు.అనంతరం నీలం మధు మాట్లాడుతూ మన తెలంగాణ పల్లెల్లో గ్రామదేవతలు సంస్కృతి, సంప్రదాయలకు పట్టుగొమ్మలని, పెద్దల నుంచి వస్తున్న ఆచార వ్యవహారాలకు పెద్ద పీట వేస్తూ ఆధ్యాత్మిక ఉత్సవాలైన బోనాలు, జాతరలను ఘనంగా నిర్వహిస్తారని తెలిపారు. గ్రామాల్లో జరిగే ఆధ్యాత్మిక సంబరాలలో కులమత బేధాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఉత్సవాలను జరుపుకుంటారన్నారు. అమ్మ వారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ శంషాబాద్ రాజు,మాజీ సర్పంచ్ లింగం, మాజీ ఉప సర్పంచ్ విఠల్, అమర్,యాదగిరి,మల్లేష్, సుదర్శన్,సురేష్, లక్ష్మణ్,భాస్కర్, మధుసూదన్, జాతర నిర్వాహకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.