|
|
by Suryaa Desk | Sat, May 31, 2025, 06:22 PM
ప్రయాణం మరింత సౌకర్యవంతంగా చేసేందుకు సర్వీస్ రోడ్డు పనులు చేపట్టినట్టు కాంగ్రెస్ మాజీ ఫోర్ లీడర్ మహంకాళి స్వామి తెలిపారు. హెచ్ కె ఆర్ ఆధ్వర్యంలో గోదావరిఖని బస్టాండ్ సమీపంలో సర్వీస్ రోడ్డు పనులను శనివారం ఆయన ప్రారంభించారు. బస్టాండ్ నుంచి కవిత థియేటర్ వరకు సర్వీస్ రోడ్డు పనులు జరుగుతాయని తెలిపారు. ఈ సర్వీస్ రోడ్డు పనులు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.