|
|
by Suryaa Desk | Sun, Jun 01, 2025, 01:06 PM
రామచంద్రపురం పరిధిలోని విద్యుత్ నగర్ కాలనీ అధ్యక్షుడు అజీమ్ ఆధ్వర్యంలో భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డికి పలు సమస్యల పై వినతి పత్రం అందజేశారు. కాలనీలో వర్షపు నీటి కాలువలో డిసిల్టింగ్ పనులు చేయాలని, దోమల బెడద ఎక్కువ ఉన్నందున వారానికి 2 సార్లు దోమల మందు పిచికారి చేయాలని కార్పొరేటర్ ని కోరారు. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని కార్పొరేటర్ కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు.