|
|
by Suryaa Desk | Mon, Jun 02, 2025, 12:39 PM
రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం నారాయణపేట జిల్లా పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ జాతీయ నాయకులకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె జాతీయ జండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “జిల్లా అన్ని వర్గాల సహకారంతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది,” అని పేర్కొన్నారు. జిల్లాను మరింత అభివృద్ధి దిశగా నడిపేందుకు అధికారులు కృషి చేయాలని ఆమె సూచించారు.