|
|
by Suryaa Desk | Mon, Jun 02, 2025, 01:18 PM
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సోమవారం ఎల్లారెడ్డిలోని మాజీ ఎమ్మెల్యే సురేందర్ ఫాంహౌస్ వద్ద బీఆర్ఎస్ నేతలు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సతీష్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అనేక పోరాటాలు, త్యాగాలు చేసిన అమరవీరులకు జోహార్లు తెలిపారు.
సతీష్ కుమార్ మాట్లాడుతూ, "తెలంగాణ రాష్ట్రం కోసం మరో స్వాతంత్ర్య పోరాటాన్ని తలపించే యుద్ధం జరిగింది. స్వేచ్ఛ కోసం ప్రాణ త్యాగం చేసిన వీరుల త్యాగ ఫలితంగా, కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ ఈ రోజు అవతరించింది" అని అన్నారు.