|
|
by Suryaa Desk | Mon, Jun 02, 2025, 01:21 PM
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయం ప్రాంగణంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో శాంతి, భద్రతల పరిరక్షణకు పోలీసులు అమూల్యమైన సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. నేరాల నివారణ, శాంతి భద్రతల పరిరక్షణలో వారి కృషి ప్రశంసనీయం అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ గర్వంగా, ఉత్సాహంగా జరుపుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి, ఏఆర్ డిఎస్పీ యాకుబ్ రెడ్డి, సీఐలు, ఎస్ఐలు తదితర అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.