|
|
by Suryaa Desk | Mon, Jun 02, 2025, 04:21 PM
నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం కృష్ణ మండలం అనంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. మొదటి విడతలో ఇంటి స్థలాలు ఉన్న పేదవారికి ఇల్లు మంజూరు చేసినట్లు చెప్పారు. విడతల వారిగా అందరికీ ఇల్లు మంజూరు చేస్తామని అన్నారు. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని పేర్కొన్నారు.