|
|
by Suryaa Desk | Tue, Jun 03, 2025, 10:57 AM
గంజాయి నిందితులకు స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి రూ.2.50 లక్షలు వసూలు చేసిన ఎస్ఐ . ఇటీవల నగర శివారులో గంజాయి విక్రయిస్తూ హైదరాబద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్‌కు పట్టుబడ్డ ముగ్గురు యువకులు. సాధారణంగా గంజాయి కేసులో పట్టుబడ్డ నిందితులను విచారణ అనంతరం నోటీసులు ఇచ్చి పంపించాల్సినప్పటికీ, బెయిల్ రావడం కష్టమని తన పోలీస్ స్టేషన్‌కు కేసు బదిలీ చేసుకొని స్టేషన్ బెయిల్ ఇప్పిస్తానని నిందితుల తల్లిదండ్రులకు చెప్పిన ఇతర పోలీస్ స్టేషన్‌కు చెందిన ఒక ఎస్ఐ . కేసు తన స్టేషన్‌కు బదిలీ అయ్యాక నిందితుల వద్ద రూ.2.50 లక్షలు తీసుకొని స్టేషన్ బెయిల్ ఇచ్చిన ఎస్ఐ ఈ విషయం బయటికి రావడంతో స్టేషన్ బెయిల్ కోసం డబ్బులు తీసుకోవడం ఏంటని, నగర శివారులో నమోదైన కేసును నగరం మధ్యలో ఉన్న తన స్టేషన్‌కు ఎలా బదిలీ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఉన్నతాధికారులు. సదరు ఎస్ఐ పట్ల విచారణ జరపగా, గతంలో అనేక అవినీతి ఆరోపణలు ఉన్నట్టు గుర్తించిన అధికారులు