|
|
by Suryaa Desk | Tue, Jun 03, 2025, 11:04 AM
జలమండలిలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం ఖైరతాబాద్ లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలకు ఎండీ అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన జలమండలి అధికారులు, ఉద్యోగులు, వినియోగదారులకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఈడీ మయాంక్ మిట్టల్, ఆపరేషన్స్ డైరెక్టర్లు వీఎల్ ప్రవీణ్ కుమార్, అమరేందర్ రెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్లు సుదర్శన్ శ్రీధర్, పర్సనల్ డైరెక్టర్ మహ్మద్ అబ్దుల్ ఖాదర్, సీజీఎంలు, జీఎంలు తదితరులు పాల్గొన్నారు.నగరంలోని వివిధ జలమండలి డివిజన్, సెక్షన్ కార్యాలయాల్లోనూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జలమండలి అధికారులు, ఉద్యోగులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.