|
|
by Suryaa Desk | Wed, Nov 05, 2025, 01:51 PM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గిరిజన విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ నాయక్ మాట్లాడుతూ, ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించే కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, సోయం బాబురావులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏఐసీసీ భవనం ముందు నిరసన ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి నాయకులు పాల్గొన్నారు.