|
|
by Suryaa Desk | Wed, Nov 05, 2025, 02:06 PM
విశాఖపట్నం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొబ్బరి తోట ఏరియాలో అఖిల్ వెంకటకృష్ణ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. CA (చార్టర్డ్ అకౌంటెంట్) పరీక్షల్లో ఫెయిల్ కావడంతో తల్లిదండ్రులను మోసం చేశానని, బ్రతికే అర్హత లేదని భావించి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పరీక్షల్లో పాస్ అవుతానని చెప్పి గుంటూరు వెళ్తున్నానని తల్లిదండ్రులకు చెప్పి, కొబ్బరి తోటలోని అద్దె గదిలోకి వెళ్లిపోయాడు. అతను హీలియం గ్యాస్‌తో ముఖానికి కవర్ తగిలించుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. గది నుంచి గ్యాస్ వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తలుపులు పగలగొట్టి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కి తరలించారు.