|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 03:21 PM
సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్‌పల్లిలో పంచాయతీ ఎన్నికల్లో సర్పంచి అభ్యర్థిగా నాగుల స్రవంతి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె భర్త ప్రశాంత్, గతంలో తాను ఓడిపోయానని, ఈసారి తన భార్యను గెలిపించాలని గ్రామస్థులను కన్నీళ్లతో వేడుకున్నారు. స్రవంతి కూడా భావోద్వేగానికి గురయ్యారు. ప్రశాంత్ వేడుకోలు చూసి ఆయన అనుచరులు కూడా చలించిపోయారు.