|
|
by Suryaa Desk | Fri, Dec 26, 2025, 05:03 AM
బుక్ మై షోలో రేటింగ్ తగ్గించడానికి ప్రణాళికాబద్ధంగా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని నిర్మాత బన్నీ వాసు అన్నారు. ప్రీమియర్ షో వేస్తే ఎవరో ఒకరు 200 టిక్కెట్లు బుక్ చేసుకుని, షో అవగానే అందరూ 1 రేటింగ్ ఇస్తారని, అలా చేయగానే బుక్ మై షోలో రేటింగ్ పడిపోతుందని ఆయన తెలిపారు. ప్రేక్షకులు మాత్రం చిత్రాన్ని చూసి ఇచ్చే రేటింగ్ కోసం వేచి చూడాలని ఆయన కోరారు.త్రిగుణ్, అఖిల్ రాజ్, హెబ్బా పటేల్, సిరి హనుమంతు, పృథ్వీరాజ్ కీలక పాత్రలో శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో వంశీ నందిపాటి, దామోదర్ ప్రసాద్ నిర్మించిన హారర్ థ్రిల్లర్ చిత్రం 'ఈషా'. ఈ చిత్రంపై జరుగుతున్న నెగిటివ్ ప్రచారం గురించి నిర్మాతలు మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బన్నీ వాసు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.మన చిత్రాన్ని దించాలనుకుంటే 300 టిక్కెట్లను రూ.30 వేల నుండి రూ.50 వేలు ఖర్చు చేసి కొనుగోలు చేసి నెగిటివ్ ప్రచారం చేస్తారని ఆయన అన్నారు. థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుడు ఈ రేటింగ్ చూసి రాడని గుర్తుంచుకోవాలని సూచించారు. ఇలాంటివి తనకు చాలాసార్లు జరిగాయని, ఇప్పుడు 'ఈషా' చిత్ర నిర్మాతలు దీనిని ఎదుర్కొంటున్నారని అన్నారు. అందుకే వారు కాస్త ఆందోళన చెందుతున్నారని, తాను ఇవన్నీ దాటుకుని సాధువులా మారిపోయానని బన్నీ వాసు పేర్కొన్నారు.
Latest News