|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 10:32 AM
టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాపై వస్తున్న పుకార్లకు తనదైన శైలిలో స్పందించారు. 'మన శంకర వరప్రసాద్' సినిమా 300 కోట్ల క్లబ్‌లో చేరిన తర్వాత, నాగార్జున లేదా వెంకటేష్‌తో సినిమా చేయనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ట్విట్టర్ వేదికగా స్పందించిన అనిల్, తాను ఇంకా స్క్రిప్ట్ కూడా మొదలుపెట్టలేదని, నటీనటులు, కథ, టైటిల్ అప్పుడే ఖరారు చేశారంటూ వస్తున్న వార్తలపై సెటైర్ వేశారు. త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తానని హామీ ఇచ్చారు. బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలున్న ఈ ప్రాజెక్ట్ పై ఫిబ్రవరి చివరి నాటికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.ఈ ఊహాగానాలపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించిన అనిల్ రావిపూడి,వ్యంగ్యంగా ఓ ట్వీట్ చేశారు."నేను ఇంకా కాగితం మీద కలం కూడా పెట్టలేదు. అప్పుడే కథ,నటీనటులు,టైటిల్ వరకు ఫిక్స్ చేసేశారు. ఇదే స్పీడ్ కొనసాగితే మీరే యాక్షన్...కట్ కూడా చెప్పేస్తారేమో!"అంటూ సెటైర్ వేశారు.తన పేరుతో వస్తున్న ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టంచేశారు. తన తదుపరి సినిమా ఎవరితో, ఏ కథతో ఉండబోతుందన్న విషయాలను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తానని తెలిపారు."నేను చేయబోయే సినిమా ఏది,ఎవరితో అనేది పూర్తి నిజమైన వివరాలతో అతి త్వరలో మీ ముందుకు తీసుకొస్తాం" అని అభిమానులకు భరోసా ఇచ్చారు.ప్రస్తుతం ఆయన చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Latest News