|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 03:34 PM
టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల తాజాగా తన ఎంబీబీఎస్ (MBBS) డిగ్రీని విజయవంతంగా పూర్తి చేసి, అధికారికంగా డాక్టర్ పట్టా అందుకున్నారు. వరుస షూటింగ్లతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నప్పటికీ, చదువుపై ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఈ ఘనత సాధించారు. ఫిబ్రవరి 11, 2026న జరిగిన కాన్వకేషన్ వేడుకలో ఆమె పట్టా అందుకుంటున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయినప్పటికీ చదువును వదలకుండా రెండింటినీ సరైన విధంగా నిర్వహించడం ఆమె స్పెషాలిటీగా నిలిచింది. ఇటీవల కాలంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఆమె పరీక్షల సమయంలో షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చి చదువుపై దృష్టి పెట్టిందని సమాచారం. ఇప్పుడు ఎంబీబీఎస్ కంప్లీట్ చేయడంతో అభిమానులు, సినీ ప్రముఖులు, ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో విషెస్ తెలియజేస్తున్నారు.
Latest News