|
|
by Suryaa Desk | Thu, Feb 12, 2026, 03:05 PM
సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘యుఫోరియా’పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమాను వీక్షించిన ఆయన, తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది."గుణశేఖర్ గారు కథలను చెప్పే విధానంలో ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుంది. సినిమాను నేను బాగా ఆస్వాదించాను, ముఖ్యంగా క్లైమాక్స్ అద్భుతంగా ఉంది. ఇది తప్పక చూడాల్సిన సినిమా" అని మహేశ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. దర్శకుడు గుణశేఖర్‌తో పాటు నటి భూమికా చావ్లా, నిర్మాతలు నీలిమ గుణ, యుక్త గుణ, సంగీత దర్శకుడు కాల భైరవ, నటి సారా అర్జున్ సహా మొత్తం చిత్ర బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
Latest News