|
|
by Suryaa Desk | Sat, Mar 21, 2026, 02:20 PM
ప్రముఖ ఒడిస్సీ నృత్యకారిణి మధుమిత రౌత్ (59) కన్నుమూశారు. గుండెపోటుతో శనివారం ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం లోధి శ్మశానవాటికలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1950వ దశకంలో శాస్త్రీయ పరిజ్ఞానంతో ఒడిస్సీ నృత్య పునరుద్ధరణకు దోహదపడిన మాయాధర్ రౌత్ కుమార్తెనే మధుమిత రౌత్. ఆమె ఒడిస్సీ నృత్యాభివృద్ధికి విశేష కృషి చేశారు. దేశ విదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చి, ఎన్నో పురస్కారాలు అందుకున్నారు.
Latest News