|
|
by Suryaa Desk | Mon, Mar 23, 2026, 02:06 PM
సినిమాలు బాగుంటే వాటి కొనసాగింపు కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. బాహుబలి, పుష్ప, కేజీఎఫ్, కాంతార వంటి చిత్రాలు సీక్వెల్స్‌తో భారీ విజయం సాధించాయి. ఇప్పుడు ధురంధర్ సినిమా విషయంలోనూ ఇదే జరుగుతోంది. 2025 డిసెంబర్‌లో విడుదలైన ధురంధర్, రూ.1350 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీని సీక్వెల్ ధురంధర్ 2: ది రివేంజ్ మార్చి 19న విడుదలై, నాలుగు రోజుల్లోనే రూ.761 కోట్లు రాబట్టింది. అయితే, ధురంధర్ 3: ది ఫైనల్ చాప్టర్ జూన్ 14న విడుదల కానుందని ఏఐ సాయంతో సృష్టించిన నకిలీ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిత్రయూనిట్ మాత్రం మూడో భాగం గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు.
Latest News