|
|
by Suryaa Desk | Wed, Nov 22, 2023, 01:52 PM
వెంకటేశ్ కథానాయకుడిగా శైలేశ్ కొలను దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'సైంధవ్’ . వచ్చే ఏడాది జనవరి 13న సినిమా విడుదల కానుంది. తమిళ నటుడు ఆర్య, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్థిఖీ, రుహానీ శర్మ, శ్రద్థా శ్రీనాథ్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ప్రచారం కార్యక్రమాలను చిత్ర బృందం జోరుగా చేస్తోంది. తాజాగా హైదరాబాద్‌లోని సీఎంఆర్ కాలేజీలో ‘రాంగ్ యూసేజ్’ పాటను విడుదల చేశారు. అనంతరం, వెంకటేశ్ విద్యార్థులతో ముచ్చటించారు.‘‘ఇన్నేళ్లుగా మీరంతా నాపై చూపిస్తున్న ప్రేమకు సంతోషంగా ఉంది. ‘సైంధవ్’ నా 75వ చిత్రం. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. శైలేష్ రొటీన్‌కు భిన్నంగా అద్భుతంగా తెరకెక్కించాడు. ‘రాంగ్ యూేసజ్’ సాంగ్ విషయానికొస్తే సెల్‌ఫోన్, డబ్బును ప్రేమిస్తూ మనకు మనం దూరం అవుతున్నామని ఈ పాట గుర్తుచేస్తుంది. ప్రతిరోజు పాజిటివ్‌గా ఆలోచించడం అలవాటు చేసుకోండి. జీవితం చాలా చిన్నది. ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నించండి’’ అని విద్యార్థులకు వెంకీ సూచనలు ఇచ్చారు .
Latest News