|
|
by Suryaa Desk | Wed, Dec 06, 2023, 01:26 PM
కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిదానం మంగళ, బుధవారాల్లో భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసం కావడంతో స్వామిని దర్శించుకునేందుకు వేకువ జాము నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు.
ఆలయంలో అభిషేకం నిర్వహించారు. అనంతరం బేతాళుడు, శ్రీరాముల వారిని కూడా దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో వెంకటేశం అధికారులు బందోబస్తు నిర్వహించారు. ఆలయ పాలకమండలి సభ్యుడు పోచమ్మల ప్రవీణ్ తన డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం నియమించిన తర్వాత అధికారం కోల్పోవడం వల్లే రాజీనామా చేశానని పేర్కొన్నారు.