|
|
by Suryaa Desk | Thu, Jun 20, 2024, 02:18 PM
వర్షాకాలం ప్రారంభం కావడంతో 9వ విడత హరితహారంలో భాగంగా వనపర్తి జిల్లా వ్యాప్తంగా 16 లక్షల మొక్కలు నాటేందుకు అధికారులు తగిన ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకుగాను నెలాఖరు నాటికి ఉపాధిహామీ కూలీలతో 10 లక్షల గుంతలు తవ్వేందుకు కార్యాచరణ రూపొందించారు. ఇప్పటి వరకు 3 లక్షల గుంతలు సిద్ధం చేసినట్లు ఉపాధి అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ప్రతి గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నారు.