|
|
by Suryaa Desk | Thu, Jun 20, 2024, 02:12 PM
కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్ మండల నూతన ఎంపీడీవోగా మాధురి గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. గతంలో వీరు హైదరాబాద్ లో సెర్ప్ ప్రాజెక్టు పనిచేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కొరకై తన వంతు కృషి చేస్తానని అన్నారు. పంచాయతీ కార్యదర్శులు ప్రతిరోజు గ్రామాలకు వెళ్లి గ్రామాల్లో ఉన్న సమస్యల పరిష్కారంకై శక్తి వంచన లేకుండా కృషి చేయాలని సూచించారు.