|
|
by Suryaa Desk | Thu, Jun 20, 2024, 02:09 PM
విలేజ్ ఇన్ పార్టనర్షిప్ (విఐపి) సంస్థ నిర్వాహకులు నాగేందర్ స్వామి ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని దాచే లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ లో బుధవారం ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినిలకు ప్రశంస పత్రం, రూ. 5000 నగదు అందజేసే కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్ లు ప్రతిభ కనబరిచిన విద్యార్థునిలకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.