by Suryaa Desk | Wed, Sep 25, 2024, 02:29 PM
భారీ వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ చెప్పారు. రెండు రోజుల్లో రైతులకు పరిహారం అందిస్తామని చెప్పారు. పంట నష్టానికి సంబంధించి జిల్లాల నుంచి నివేదికలు రావాల్సి ఉందన్నారు. అయితే కేంద్రం నుంచి ఇప్పటివరకు వరద సాయం అందలేదని చెప్పారు. తక్షణ సాయంగా రూ.10వేల కోట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఇటీవల తాము కోరినట్లు ఆయన తెలిపారు.