by Suryaa Desk | Fri, Jan 31, 2025, 02:38 PM
మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండల కేంద్రంలో శుక్రవారం దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి నూతన ఎంపీడీఓ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. గత బిఆర్ఎస్ పాలనలో కౌకుంట్ల మండలంను నామమాత్రంగానే ప్రకటించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో కౌకుంట్ల మండలాన్ని అన్ని వసతులతో కూడిన గజిట్ ఏర్పాటు చేసి కార్యాలయాలను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ తాసిల్దార్ ఎంపీడీఓ పాల్గొన్నారు.