by Suryaa Desk | Tue, Jan 28, 2025, 02:38 PM
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ ఐక్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు గౌడ్ అన్నారు.
మంగళవారం నారాయణపేట పట్టణంలోని అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో పొందుపరిచిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.