by Suryaa Desk | Mon, Jan 27, 2025, 06:36 PM
జూనియర్ న్యాయవాదులు ప్రతిరోజూ కోర్టుకు రావాలని, ప్రాక్టీస్ ద్వారా తమ పనితీరు మెరుగు పరచుకోవాలని సీనియర్ సివిల్ కోర్టు జడ్జి నాగేశ్వరరావు సూచించారు. మెట్ పల్లి పట్టణంలోని కోర్టు ఆవరణలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో న్యాయవాదులకు బహుమతులను అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదులు క్రమశిక్షణతో మెలిగి వృత్తికి గౌరవాన్ని తీసుకురావాలని సూచించారు. న్యాయవాదులు హక్కులతో పాటు బాధ్యతను సైతం తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ కోర్టు జడ్జి అరుణ్ కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల లింబాద్రి, ఉపాధ్యక్షులు రాంబాబు, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, ఏజిపి హఫీజ్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.