by Suryaa Desk | Mon, Jan 27, 2025, 10:50 AM
తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో యువకుడు హత్యకు గురైయ్యాడు. మూసి కెనాల్ కట్టపై మృతదేహం లభ్యమయింది. మృతుడు మామిళ్లగడ్డకు చెందిన కృష్ణగా గుర్తించారు.మృతదేహాన్ని పరిశీలించగా యువకుడిని బండరాళ్లతో కొట్టి హత్య చేసినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. కృష్ణ ఆరు నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. ప్రేమ, పెళ్లి గొడవలే హత్యకు కారణమే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.