by Suryaa Desk | Sat, Jan 25, 2025, 02:04 PM
యాదాద్రి జిల్లా భువనగిరిలో బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు సంయక్తంగా మహా ధర్నా చేపట్టాయి. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై RRR అలైన్‌మెంట్ రైతులతో రాస్తారోకో నిర్వహించాయి. ఆర్‌ఆర్‌ఆర్ బాధితులకు న్యాయం చేయాలని బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.