by Suryaa Desk | Fri, Jan 24, 2025, 12:49 PM
హైదరాబాద్‌లోని లక్డీకాపూల్, సెక్రటేరియట్ పరిసరాల్లో భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. కంటైనర్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడటంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.మూసాపేట్ నుంచి కాటేదాన్ వెళ్తున్న లారీ ఉదయం లక్డికాపూల్‌లో టర్నింగ్ వద్దకు రాగానే బోల్తా కొట్టింది. అయితే ప్రమాద సమయంలో రోడ్డుపై ఎక్కువగా వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. డ్రైవర్, క్లీనర్‌కు మాత్రం స్వల్ప గాయాలైనట్లు సమాచారం. రోడ్డు ఒకవైపు కంటైనర్ బోల్తా పడటంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.ట్రాఫిక్‌లో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన (Hyderabad Traffic Police) ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేయడానికి వాహనాలను మరో రూట్లోకి మళ్లిస్తున్నారు. బోల్తాపడిన లారీని భారీ క్రేన్ సహాయంతో అధికారులు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.