by Suryaa Desk | Tue, Jan 21, 2025, 09:52 PM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గ్రామసభలను విజయవంతం అయ్యేలా అధికారుల సమన్వయంతో ప్రతి ఒక్క కార్యకర్త చూడాలని మెట్ పల్లి మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
సోమవారం ఒక పత్రిక ప్రకటన ద్వారా పలు విషయాలు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న మరో నాలుగు సంక్షేమ పథకాలను అందరికీ చేరేలా పారదర్శకంగా పనిచేయాలని కోరారు. బారాసా నాయకుల అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రజలను కోరారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.