by Suryaa Desk | Fri, Jan 17, 2025, 06:44 PM
సాంప్రదాయ సంస్కృతికి సంక్రాంతి ముగ్గులు అద్దం పట్టాయని సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన భక్తి రత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు శుక్రవారం అన్నారు. గజ్వేల్ పట్టణంలో నిర్వహించిన రామకోటి ముగ్గుల పోటీలలోని విజేతలకు రామరాజు బహుమతులను అందజేశారు. ఈ పోటీలో 455 మంది మహిళలు పాల్గొని పోటీపడ్డట్లు ఆయన చెప్పారు.