by Suryaa Desk | Fri, Jan 17, 2025, 04:14 PM
ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న సంక్షేమ పథకాలకు సంబంధించి కూసుమంచి మండలం గట్టుసింగారం గ్రామంలో జరుగుతున్న సర్వే తీరును ఖమ్మం ఆర్డీవో నర్సింహరావు, జేడీ పుల్లయ్య శుక్రవారం పరిశీలించారు. రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోందన్నారు. ఇందులో భాగంగా సాగుకు యోగ్యం కాని భూముల సర్వేను పరిశీలించి పలు సూచనలు చేశారు. వారి వెంట ఏడీఏ సరిత, ఏవో వాణి పాల్గొన్నారు.