by Suryaa Desk | Mon, Jan 13, 2025, 12:21 PM
ముఖ్యమంత్రి సహాయనిధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం ఇంచార్జ్ పామేన భీం భరత్ అన్నారు. నియోజకవర్గ కేంద్రంలోని తన నివాసంలో ఆదివారం సీఎంఆర్‌ఎఫ్ నుంచి మంజూరైన నియోజకవర్గంలోని 12 మందికి చెందిన రూ.7,02,500 విలువైన సీఎం సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు సీఎం సహాయనిధి దోహద పడుతుందన్నారు. పేదల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందన్నారు. ఆరోగ్యం పట్ల ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి చేసేందుకే నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల హామీలను అమలు చేసేందుకు సీఎం కృషి చేస్తున్నారని, జనవరి 26 నుంచి రైతుభరోసా అమలు చేస్తారన్నారు.
ఈ కార్యక్రమంలో మొహినాబాద్ మండల అధ్యక్షులు మాణెయ్య, టీపీసీసీ కార్యదర్శి రామ్ రెడ్డి, షాబాద్ మాజీ సర్పంచ్ రవీందర్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ లు నర్సిములు, కొండల్ యాదవ్, నాయకులు చెన్నయ్య, సుభాష్, మల్లేష్, బందయ్య, నందు, బిక్షపతి, భద్రప్ప, ఉపేందర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు సుభాస్, బుచ్చయ్య, తొల్కట్ట, సత్యనారాయణ, శ్రీనివాస్ మినహుద్దీన్, అశ్రత్, నర్సింలు, కృష్ణ , చంటి, చిలుకూరు రాజు , కుమార్ తదితరులు పాల్గొన్నారు.