by Suryaa Desk | Sun, Jan 12, 2025, 11:47 AM
షార్టు సర్క్యూట్ తో కారు దగ్ధమైన ఘటన బూర్గంపాడు మండల పరిధిలోని చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలు మోరంపల్లి బంజర గ్రామానికి చెందిన మూల వెంకటరమణా రెడ్డి అనే వ్యక్తి తన కారులో వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. ఈ క్రమంలో షార్ట్ సర్క్యూట్ వల్ల కారులో మంటలు చెలరేగగా, అప్రమత్తమై దిగారని తెలిపారు. దీంతో కారు పూర్తిగా దగ్ధమైందని అన్నారు. ఈ ఘటనపై బూర్గంపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.