by Suryaa Desk | Sun, Jan 12, 2025, 02:58 PM
వడ్డెర సంఘం నియోజక వర్గ అధ్యక్షుడు చింతల నాగేశ్వర రావు అధ్యక్షత న జరిగిన ఈ సమావేశానికి ఒంటి పులి గోపయ్య వంటిపులివెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంధర్బంగా వెంకటేష్ మాట్లాడుతూ,వడ్డెర ఓబన్న 1807జనవరి 11 న నంద్యాల జిల్లా, సంజామల మండలం నోస్సం గ్రామంలో జన్మించారు.... బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దురాగతాలను ఎదురొడ్డి నిలిచిన వీరుడు వడ్డెర ఓబన్న..ఆనాటి రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కి కుడి భుజంగా, సర్వ సైన్యాధ్యక్షుడుగా 9000 మంది సైనికులను ముందుండి నడిపిన గెరిల్లా యుద్ద వీరుడు వడ్డెర ఒబన్న... 1846జూలై లో నంద్యాల జిల్లా కోవెల కుంట్ల సబ్ ట్రెజరీ పై తన సైన్యంతో దాడిచేసి, కొల్లగొట్టిన ధనాన్ని పేద రైతులకు పంచిన మానవతా వాది వడ్డెర ఒబన్న... వడ్డెర ఒబన్న జయంతి వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం.
పట్ల వడ్డెర కులస్తుల తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు వడ్డెర కులానికి వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి కృషిచేసి జరుపటి జైపాల్ కి కార్పొరేషన్ చైర్మన్ గా నియమించిన మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కి ఉత్తం పద్మావతి కి వడ్డెర కులస్తుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో, చింతల లింగయ్య, వేముల వెంకయ్య వంటిపులి శ్రీను, బత్తుల ఉపేందర్, ఉప్పతల శ్రీనివాస్, ఓర్సు దుర్గారావు, బండ్ల దాసు ఉప్పతల కోటేశ్వర రావు, వేముల బాలయ్య , దేవరంగుల శ్రీను, చల్లా సూర్యం, వేముల రాము, వల్లెపు వీరయ్య, ఉప్పతల చిన్న లింగయ్య, గుంజి సైదులు, చింతల రమేష్, పందిబోటు దుర్గారావు, రమేశ్ మరియు వడ్డెర కులపెద్దలు పాల్గోన్నారు.