by Suryaa Desk | Sun, Jan 12, 2025, 03:54 PM
తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నేడు మూడో రోజు కార్యక్రమంలో భాగంగా లక్ష్మీ నరసింహ స్వామి వారు శ్రీరాముని అవతారంలో అలంకరించి తిరువీధుల్లో ఊరేగింపుగా తిరుగుతూ భక్తులకు ఆదివారం దర్శనం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భాస్కరరావుతో పాటు ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.