by Suryaa Desk | Sun, Jan 12, 2025, 03:13 PM
అఖిల గాండ్ల తిలకుల మహిళా సంఘం ఆధ్వర్యంలో పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో నిర్వహించిన ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శ్రీమతి ఈర్ల స్వరూప మాట్లాడుతూ..సంక్రాంతి పండుగ ప్రజల జీవితాలలో వెలుగుని ఇస్తుందని, సనాతన సంప్రదాయాన్ని ఉమ్మడి కుటుంబ ప్రాముఖ్యతని చాటి చెబుతుందని అన్నారు. మహిళా సంఘం అధ్యక్షురాలు వెన్నంపల్లి లక్ష్మీ మాట్లాడుతూ..ఈ కార్యక్రమానికి విచ్చేసిన కుల బంధువులందరికీ,బహుమతులు అందజేసిన గానుగ వేదిక సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా చైర్పర్సన్ ఈర్ల స్వరూప ని గార్ల కుల బంధువులందరూ ఘనంగా సన్మానించారు.
చుక్కల ముగ్గులు, డిజైన్ ముగ్గులలో మొదటి బహుమతి పొందిన సుమలత,పోతునురి అఖిల శ్రీ ద్వితీయ బహుమతి అనూష, సహస్ర శ్రీ ,మూడో బహుమతి వెన్నoపల్లి లక్ష్మి ,స్వరూప, ముగ్గులు వేసే ప్రతి ఒక్కరికి ప్రత్యేక బహుమతులు చైర్ పర్సన్ ఈర్ల స్వరూప, పోతునూరి,స్వప్న ,వెన్నoపల్లి లక్ష్మి, వెన్నoపల్లి పుణ్యవతి, అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పోతునూరి స్వప్న, ఉపాధ్యక్షులు వెన్నంపల్లి పుణ్యవతి, పోతునూరీ రేవతి రాజేంద్రప్రసాద్,వెన్నoపల్లి శ్రీనివాస్, యువజన నాయకులు వెన్నoపల్లి శరత్, లెక్కల నగేష్, వెన్నంపల్లి శశిధర్ ప్రణవి ,మణి, ప్రియ, జక్కం ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.