by Suryaa Desk | Sun, Jan 12, 2025, 02:55 PM
స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఆదివారం సిద్ధిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో స్వామి వివేకానంద చిత్రపటానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబటి బాలేష్ గౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానంద తన ప్రసంగాలతో భారత జాతిని మేల్కొల్పారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.