by Suryaa Desk | Sun, Jan 12, 2025, 04:01 PM
రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చిరుత పులి కలకలం సృష్టించింది. ఆదివారం ఉదయం యూనివర్సిటీలో మార్నింగ్ వాక్‌కు వెళ్లిన కొందరికి చిరుత పులి కనిపించింది. దీంతో యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.యూనివర్సిటీలోని జయశంకర్ విగ్రహం వద్ద చిరుత కనిపించిందని మార్నింగ్ వాకర్స్ తెలిపారు. ఆ ప్రాంతంలో పులి పాదముద్రలను అధికారులు గుర్తించారు. అయితే మార్నింగ్ వాకర్స్‌ను గమనించిన చిరుత.. చెట్ల పొదల్లోకి వెళ్లినట్లు పేర్కొన్నారు. చిరుత పులి ఆచూకీ కోసం అటవీ శాఖ అధికారులు గాలిస్తున్నారు.గతంలోనూ క్యాంపస్ పరిసర ప్రాంతాల్లో చిరుత పులి సంచరించింది. అప్పుడు చిరుతను బంధించారు అధికారులు. చిరుతపులి శంషాబాద్, గగన్‌పహాడ్‌లోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఉండి హిమాయత్‌సాగర్, శంషాబాద్, రాజేంద్రనగర్, మొయినాబాద్‌లోని గ్రామాల చుట్టూ సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు.