by Suryaa Desk | Sun, Jan 12, 2025, 03:23 PM
పెద్దపల్లి పట్టణంలోని అరబిందో కాకతీయ సెకండరీ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇందులో భాగంగా పిల్లలు హరిదాసులుగా,గోదాదేవిగా,డూడూ బసవన్నలుగా ప్రత్యేక ఆకర్షణగా నిలవడం జరిగింది. పిల్లలకు భోగి పండ్లను పోయడం, పొంగలి వండడం, బోగిమంటలు వేయడం ఈ కార్యక్రమంలో సందడిగా నిలిచాయి.ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం ముగ్గుల పోటీ నిర్వహించి గెలుపొందిన పిల్లల తల్లులకు బహుమతులను డైరెక్టర్ మణి ప్రధానం చేయడం జరిగింది.
ఈ సందర్బంగా తెలుగు ఉపాధ్యాయులు కరుణాకర్ మాట్లాడుతూ..పండుగ విశిష్టతను పిల్లందరికి వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ మణి, కరస్పాండెంట్ ఆర్వి రమణారావు, ప్రధానోపాధ్యాయులు సుధాకర్, పాఠశాల ఇంచార్జ్ ఇమ్రాన సుల్తానా, పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయ బృందం పాల్గొనడం జరిగింది.