by Suryaa Desk | Sun, Jan 12, 2025, 03:25 PM
మండల కేంద్రం బెజ్జంకిలో ఎమ్మార్పీఎస్ కళాబృందం ప్రదర్శనలు శనివారం బస్టాండ్ ప్రాంతంలో జరిగాయి. ఈ ప్రదర్శనలు సిద్దిపేట జిల్లా కళాబృందం డప్పుల రమేష్ సారాధ్యంలో కళాకారులు ఇనుప సురేష్, దుబ్బాక శ్యాంసుందర్, చెవిటి బిక్షపతి, కొమ్ము రమేష్, శంకర్ పాటల ద్వారా పలువుని ఆకట్టుకున్నారు.
అంతకుముందు మండల కేంద్రం బెజ్జంకిలోని గ్రామ పురవీధుల గుండా డప్పు చప్పుల్లతో భారీ ర్యాలీ ఎమ్మార్పీఎస్ నేతలు నిర్వహించారు. ఈ కళా ప్రదర్శనలో బెజ్జంకి మండలం ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు వడ్లూరి పరుశరాములు ఆధ్వర్యంలో జరగగా లింగాల లక్ష్మణ్, కర్రవుల మల్లేశం, చింతకింది పర్షరాములు, జనగాం శంకర్, బిగుళ్ల మోహన్ తదితరులు పాల్గొన్నారు.