by Suryaa Desk | Sun, Jan 12, 2025, 12:54 PM
సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రజలు సొంతూళ్ల బాట పట్టారు. దీంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఇక్కడ అరకిలోమీటరు మేర ట్రాఫిక్ నిలిచింది. ఏపీ వైపు వెళ్లే వాహనాలను 12 గేట్ల ద్వారా టోల్ సిబ్బంది పంపిస్తున్నారు. మరోవైపు ప్రైవేటు బస్సుల్లో ఛార్జీలు భారీగా ఉండటంతో కొంత మంది బైక్‌లు, కార్లలో వెళ్తున్నారు. ఆదివారం వేకువజాము నుంచే HYD శివారు ప్రాంతాల్లో రద్దీ నెలకొంది.