by Suryaa Desk | Sun, Jan 12, 2025, 03:07 PM
ఈనెల 30న హనుమకొండలో పబ్లిక్ గార్డెన్స్ నుండి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వరకు చిన్న జీయర్ స్వామి పర్యవేక్షణలో నిర్వహించనున్న సంకీర్తన మండలి శోభాయాత్రను విజయవంతం చేయాలని వికాస తరంగిణి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బచ్చు రాధాకృష్ణ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో శనివారం వికాస తరంగిణి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కార్యక్రమం కరపత్రాలను ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ భక్తి మార్గంలో ప్రయాణిస్తున్న వివిధ సంప్రదాయాలకు చెందిన కళారూపాలను పరిరక్షించుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని చిన్న జీయర్ స్వామి నిర్వహిస్తున్నారని అన్నారు. భక్తి కళా సంఘాలను సంఘటితం చేయడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో వికాస తరంగిణి బాద్యులు ఆరుట్ల కేశవమూర్తి, ఆరుట్ల మాధవ మూర్తి, పోలు రాజేష్ కుమార్, నాగ బండి శివప్రసాద్, జనగాం సాంబయ్య, మునుకుంట్ల సతీష్ , పుష్పలీల తదితరులు పాల్గొన్నారు.